Subject Expert Committee gives nod to Covaxin for Phase 2, 3 trials on children aged 2 to 18 years
#COVAXIN
#Covaxin2to18years
#BharatBiotechCovaxinchildren
#phase3clinicaltrials
#PfizerBioNTechCOVID19vaccine
#SubjectExpertCommittee
#DCGI
#Coronavirus
#CovaxinPhase2and3trialsonchildren
#Covishield
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్.. మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బయోటెక్ తన పరిశోధనల్లో మరింత పురోగతిని సాధించింది. కోవాగ్జిన్ సృష్టికర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఫార్మా కంపెనీ.. దాన్ని మరింత అభివృద్ధి చేసింది. రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల లోపు వారికి కూడా కోవాగ్జిన్‌ను వ్యాక్సిన్‌ను ఇచ్చేలా దాన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను త్వరలోనే ఆరంభించబోతోంది.